Header Banner

గుడ్ న్యూస్: ట్రంప్ కు షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు!

  Fri Feb 28, 2025 15:10        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫెడరల్ జడ్జి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపులపై సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలోని వివిద ఏజెన్సీలు నియమించుకున్న ఉద్యోగులను తొలగించే హక్కు ట్రంప్ సర్కారుకు లేదని స్పష్టం చేశారు. ఆయా ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఖర్చులను, దుబారాను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయాలని ట్రంప్ సర్కారు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)ని ఏర్పాటు చేసిన ట్రంప్ దానికి ఎలాన్ మస్క్ ను సలహాదారుగా నియమించారు. డోజ్ ఇటీవల ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది.

 

ఇది కూడా చదవండి: డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్! విద్యార్థులకూ గోల్డ్ కార్డ్ వీసాలు! ఆ ఒక్కటి చేస్తే చాలు!

 

మాస్ ఫైరింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన జడ్జి తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉద్యోగుల నియామకాలు, తొలగింపుల అధికారం ఆయా ఏజెన్సీలకు మాత్రమే ఉందని, డోజ్ జారీ చేసిన తొలగింపుల ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ కు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శరణార్థులకు ఆశ్రయం కల్పించబోమని ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు బ్లాక్ చేసింది. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను మరో కోర్టు సస్పెండ్ చేసింది. తాజాగా ఉద్యోగుల మాస్ ఫైరింగ్ ఉత్తర్వుల విషయంలోనూ కోర్టు అభ్యంతరం తెలిపింది.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #DonaldTrump #MassFiringFederal #Workers #US #Judge #America #layoffs